ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ కు నేటితో ముగిసిన రెండు సంవత్సరాల కెప్టెన్సీ నిషేధం

cricketer-steve-smith-two-year-captaincy-ban-end-today
అవకాశం లభిస్తే స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియాకు మళ్ళీ కెప్టెన్ కావొచ్చు అతని పై ఉన్న రెండేళ్ల కెప్టెన్సీ నిషేధం ఆదివారంతో  ముగిసింది. 

దక్షిణాఫ్రికాలో 2018 బాల్ టాంపరింగ్ పాల్గొన్నందుకు స్మిత్ కెప్టెన్సీ నుండి తొలగించబడ్డాడు మరియు ఆస్ట్రేలియాకు క్రికెట్ టీం కు కెప్టెన్ గ ఉండడానికి వీలులేకుండా రెండు సంవత్సరాల పాటు నిషేధించబడ్డాడు. అతని విధించబడిన శిక్ష ఆదివారం ముగిసింది మరియు ఆస్ట్రేలియా క్రికెట్ టీం అతన్ని కెప్టెన్ గా ప్రకటిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. 

స్మిత్ ఒక స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ, మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి, తన ఇంటి వ్యాయామశాలలో సాధన, 10 కిలోమీటర్ల పరుగు మరియు గిటార్ ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పాడు.

ఆస్ట్రేలియా ఆటగాళ్ళు కొందరు ఈ వారంలో న్యూజిలాండ్‌లో సిరీస్ ముగించి, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చేరాల్సి  (IPL) చేరాల్సి ఉంది. IPL 2020 జరుగుతుందా లేదా మరియు ఇతర అంతర్జాతీయ మ్యాచ్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయో ఇంకా స్పష్టత లేదు.  

Post a Comment

0 Comments