మీ హోమ్ లోన్ అకౌంట్ ని తరుచుగా చెక్ చేసుకుంటున్నారా ?

గృహ రుణాన్ని తీసుకోవడం పెద్ద నిర్ణయం. ఈ పెట్టుబడి మీకు కనీసం రూ. 5 లక్షల పన్ను ఆదా చేసే అవకాశం ఉంది. అలాగే  కనీసం 15-20 సంవత్సరాలు కొనసాగే గృహ ఋణం గురించి ఎంతో ఫైనాన్సియల్ ప్లానింగ్ అవసరం ఉంటుంది. ఈ సమయంలో మీ జీవితం ఖచ్చితంగా కొన్ని మార్పులకు లోనవుతుంది. ఉదాహరణకు, మీ ఆర్థిక బలం మెరుగుపడవచ్చు లేదా క్షీణించవచ్చు, వడ్డీ రేట్లలో గణనీయమైన మార్పులు ఉండవచ్చు, ప్రభుత్వం. విధానాలు మరియు దేశ ఆర్థిక స్థితి మారవచ్చు. అందువల్ల మీరు మీ గృహ రుణ మొత్తాన్ని ఎల్లప్పుడూ గమనించాలి. మీ గృహ రుణ మొత్తం యొక్క బాలన్స్ ని తరచుగా సమీక్షిస్తుండాలి  దీని వలన మీరు బ్యాలెన్స్ బదిలీ అవసరమా అని  ప్రీ క్లోసర్, టాప్ అప్ లోన్  అవసరమా అని నిర్ణయించడంలో మీకు సహాయపడుతుంది.
home_loan_2.jpg (500×400)
బాలన్స్ ట్రాన్స్ఫర్ 
రుణాలపై వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. గృహ రుణాన్ని తీసుకునే సమయంలో మీకు మంచి ఒప్పందం లభించినప్పటికీ, కొన్ని సంవత్సరాల తరువాత  మీకు తక్కువ  వడ్డీ రేట్లు మరియు మెరుగైన సేవలను అందిస్తున్న రుణదాతలు, బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు ఉండవచ్చు. అటువంటి సందర్భంలో రుణదాతలను మార్చకపోవడం అవివేకమే అవుతుంది. మీకు మంచి రుణ చెల్లింపు రికార్డు మరియు మంచి క్రెడిట్ స్కోరు ఉంటే ఎటువంటి ప్రాబ్లెమ్ లేకుండా హోమ్ లోన్ బాలన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 

ప్రీ క్లోసర్ 
అకస్మాత్తుగా డబ్బు చేతికి అందినా లేదా అప్రైసల్ బోనస్ వచ్చినా మీ హోమ్ లోన్ ని ముందస్తుగా తిరిగి చెల్లించేయొచ్చు.  నెలవారీగా కడుతున్నరుణ మొత్తం కంటే ఎక్కువ కడితే మీకు మంత్లీ EMI తగ్గే అవకాశం ఉంటుంది. కొంతమంది రుణదాతలు ప్రీక్లోసర్  కోసం కొంత రుసుము వసూలు చేయవచ్చు. గృహ రుణాన్ని పూర్తిగా చెల్లించాక రుణదాత నుండి అసలు ఆస్తి పత్రాలను తీసుకోవడం మర్చిపోవద్దు. 

టాప్ అప్ లోన్ 
మీ అన్ని ఆర్థిక అవసరాలను తీర్చడానికి మొదట మంజూరు చేసిన రుణ మొత్తం సరిపోకపోతే, మీరు టాప్-అప్ లోన్  పొందవచ్చు. టాప్-అప్ లోన్  ప్రాథమికంగా వ్యక్తిగత రుణం లాంటిది  కాబట్టి వడ్డీ రేటు గృహ రుణం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది.

మీ హోమ్ లోన్ కాతా ను తరుచుగా చెక్ చేసుకుంటూ, సరైన ఫైనాన్సియల్ ప్లానింగ్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావు. 

Post a Comment

0 Comments