రాంచరణ్ కు ట్విట్టర్ లో స్వాగతం చెప్పిన మెగా స్టార్ చిరంజీవి

chiranjeevi-welcomes-son-ramcharan-to-twitter.png (534×751)
తెలుగు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన ఒక రోజు తర్వాత, అతని కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్‌లో రీ ఎంట్రీ ఇచ్చారు. గత సంవత్సరం ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన రామ్ చరణ్, 2010 ట్విట్టర్‌లో అకౌంట్ ఓపెన్ చేశారు, అయితే ఆ ప్రొఫైల్ ను ఎక్కువగా వాడలేదు. అయితే ఇప్పుడు కరోనావైరస్ వ్యాప్తి మధ్య కేంద్ర మరియు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సహాయ నిధులకు విరాళం ఇవ్వడానికి తనకు ఇన్స్పిరేషన్ గా నిలిచిన నటుడు, బాబాయి పవన్ కళ్యాణ్ కు తన ట్విట్టర్ అకౌంట్ @AlwaysRamcharan నుండి కృతజ్ఞతలు తెలిపారు.

ట్విట్టర్‌లో కేవలం ఒకరోజు ముందే అకౌంట్ ఓపెన్ చేసిన చిరంజీవి తన కొడుకును ట్వీట్‌తో స్వాగతించారు. "పిల్ల సింహాన్ని అనుసరిస్తుంది." అంటూ ఇంగ్లీషులో మెసేజ్ చేశారు.

చిరంజీవి, 25 మార్చ్ బుధవారం ఉగాది సందర్భంగా ట్విట్టర్ లో కొత్త ప్రొఫైల్‌లతో అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు ఈ రోజు నూతన సంవత్సరాన్ని సూచిస్తుంది.

Post a Comment

0 Comments