RRR సినిమా నుండి బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ వెళ్లిపోయిందా ?

బాహుబలి డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మరియు మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ సినిమా RRR నుండి బాలీవుడ్ సినీ నటి అలియా భట్ వైదొలిగినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తను అలియా కానీ RRR సినిమా స్టాఫ్ కానీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. 
RRR+Movie+update+Heroin+-+Alia+Bhat.jpeg (770×433)
RRR సినిమా షూటింగ్ ప్రారంభం లో వచ్చిన వార్తల ప్రకారం అలియా భట్ ఈ మల్టీ లాంగ్వేజ్ సినిమాలో నటించడానికి భారీ పారితోషకం తీసుకున్నట్లు తేలుస్తుంది. అయితే  తాను ఇప్పుడు ఈ సినిమా కోసం షూటింగ్ డేట్స్ అరెంజ్ చెయ్యలేక సినిమా నుండి పూర్తిగా వైదొలిగినట్టు తెలుస్తుంది. 

ఇంకా చదవండి :: రణబీర్ కపూర్ అలియా భట్ ప్రేమకి బ్రేక్ అప్ అయ్యిందా?

భారీ బడ్జెట్ తో, సుమారు Rs 400 కోట్లతో నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ ఇప్పుడు కరోనావైరస్ నేపథ్యంలో ఆగినట్టు తెలుస్తుంది .  మొదట RRR  సినిమా ని వచ్చే సంవత్సరం జనవరి లో విడుదల చెయ్యాలని అనుకున్నారు, కానీ ఇప్పుడు షూటింగ్ లో జరుగుతున్న ఆలస్యం వలన రిలీజ్ డేట్స్ మారే అవకాశం కూడా ఉంది. 

ప్రస్తుతం అలియా భట్ భ్రమస్త్ర, సడక్ 2 మరియు ఇతర సినిమా షూటింగ్స్ తో చాలా బిజీగ  ఉంది. 

Post a Comment

0 Comments