డిఎస్పి జోగిందర్ శర్మ ను కొనియాడిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)

icc-praises-former-cricketer-joginder-sharma-as-policeman.png (453×356)
కరోనావైరస్ మహమ్మారి విజృభిస్తున్న సమయంలో దేశానికి చేస్తున్న సేవకు అంతర్జాతీయ టికెట్ 20 ప్రపంచ కప్ హీరో జోగిందర్ శర్మను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) శనివారం ప్రశంసించింది. తన క్రికెట్ కెరీర్ అనంతరం  హర్యానా పోలీసు శాఖలో డిఎస్పిగా పనిచేస్తున్న జోగిందర్ శర్మ COVID-19 యొక్క వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు వరసలో ఉంది పోరాటం చేస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, తన రెండు విధులను కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

" 2007: # T20 వరల్డ్‌కప్ హీరో 
  2020: రియల్ వరల్డ్ హీరో
  పోలీసుగా తన క్రికెట్ అనంతర కెరీర్‌లో, ప్రపంచ ఆరోగ్య సంక్షోభం మధ్య తమ వంతు కృషి చేస్తున్న వారిలో    భారతదేశానికి చెందిన జోగిందర్ శర్మ కూడా ఉన్నారు." అంటూ ICC తన ట్విట్టర్లో తెలిపింది.




సౌత్ ఆఫ్రికాలో 2007 లో పాకిస్థాన్‌పై జరిగిన తొలి టీ 20 ప్రపంచ కప్ టైటిల్ విజయంలో జోగిందర్ శర్మ అత్యంత ముఖ్యమైన ఫైనల్ ఓవర్ బౌలింగ్ చేశాడు. మూడో బంతికి మిస్బా ఉల్ హక్ వికెట్‌ను శర్మ సాధించడంతో భారత్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి T20 వరల్డ్ కప్ మొదటి విజేతగా నిలిచింది. 

Post a Comment

0 Comments