కోల్‌కతా: బిసిసిఐ చీఫ్ సౌరవ్ గంగూలీని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం విమర్శించారు. కోల్‌కతాలో భారత్-దక్షిణాఫ్రికా వన్డే రద్దు చేసినట్లు తమ ప్రభుత్వానికి తెలియజేయలేదని మమతా తెలిపారు. పోటీని రద్దు చేయడం సరే. కానీ కోల్‌కతా పోలీసులకు లేదా ముఖ్య కార్యదర్శికి సమాచారం ఇచ్చే గౌరవాన్ని బిసిసిఐ
పాటించాల్సిఉండాల్సింది అని తెలిపారు.
గంగూలీని మమతా పరోక్షంగా విమర్శించడం ఇదే మొదటిసారి కాదు. ఇంకా బిసిసిఐ కార్యదర్శి, అమిత్ షా కుమారుడైన జై షా అతిగా ప్రవర్తించారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గంగూలీ బిజెపి ప్రచారకర్త అవుతారనే వార్తల మధ్య మమతా స్పందన వచ్చింది.
జగ్మోహన్ దాల్మియా మరణించినప్పుడు, గంగూలీని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రకటించినది మమతా బెనర్జీ నే కావడం గమనార్హం.

0 Comments