భార్య పిల్లలను మిస్ అవుతున్న హీరో విష్ణు

manchu-vishnu-emotional-missing-family-members
కరోనావైరస్ కారణంగా ఎంతో మంది తమ కుటుంబాల నుండి దూరంగా ఉండవలసి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రవాణా వ్యవస్థ నిలిచిపోయింది దీంతో చాలా మంది ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. టాలీవుడ్ హీరో మంచు విష్ణు కూడా ఇప్పుడు ఇదే బాధలో ఉన్నారు. భార్య, పిల్లలు విదేశాల్లో ఉండడంతో ఆయన వారిని ఎంతగా మిస్ అవుతున్నాడో తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టారు. 

నేను గడ్డం పెంచడం గురుంచి చాలామంది అడుగుతున్నారు, అది కొంతమందికి నచ్చుతుంది మరికొంత మందికి నచ్చట్లేదు, కానీ నేను ఒక కారణం వళ్ళ పెంచుతున్నాను. నా భార్య పిల్లలు ఇప్పుడు వేరే దేశంలో ఉన్నారు వారు ఇక్కడికి వచ్చాక షేవ్ చేసుకుంటాను అని విష్ణు అన్నారు. ఫిబ్రవరి చివర్లో మేము అందరం కుటుంబ సభ్యుడికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో సర్జరీ కోసం వేరే దేశానికి వెళ్ళాము. మార్చ్11 న నాన్నగారి బర్త్డే , విద్యానికేతన్ వార్షికోత్సవం ఉండడంతో నేను, అమ్మ, నాన్న వచ్చేసాము. మేము వచ్చిన తరువాత పరిస్థితులు మారడంతో వార్షికోత్సవం క్యాన్సల్ చేసాము. పిల్లలు, వేరోనికా ఇంకో నాలుగు, ఐదు రోజుల్లో రావాల్సి ఉంది కానీ అంతలోనే ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో వారు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. పిల్లలు పుట్టాక వేరే ఊరికి వెళ్లినా కూడా సాయంత్రం వరకు వచ్చేవాడిని, పిల్లలతో నాకు అటాచ్మెంట్ ఎక్కువ. అలాంటిది ఇప్పుడు వారంతా చాలా దూరంగా ఉండడంతో చాలా బాధగా ఉంది అంటూ మంచు విష్ణు భావోద్వేగానికి గురి అయ్యారు. 

Post a Comment

0 Comments