కరోనావైరస్ వలన కష్టాల్లో ఉన్నసినీ ఆర్టిస్టులను ఆదుకోనున్నహీరో రాజశేఖర్ దంపతులు

jeevitha-rajasekhar.jpg (450×350)
ఇండియా లో కరోనావైరస్ భారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్లు ప్రకటిస్తుండడంతో దాదాపు చాలా బిజినెస్ లు మూత పడ్డాయి. దాంతో రోజువారీ వేతనం పై పనిచేసే చాలామందికి కష్టాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో సినీ ఇండస్ట్రీలో కష్టాల్లో ఉన్నజూనియర్ ఆర్టిస్టులను ఆదుకోవాలని సినీ హీరో రాజశేఖర్, జీవిత నిర్ణయం తీసుకున్నారు. 

కరోనా వైరస్ ని అరికట్టే చర్యల నేపథ్యంలో సినిమా షూటింగ్ లు కూడా బంద్ చేయాలని ప్రభుత్వం ఆదేశించండంతో అన్నిసినీ కార్యక్రమాలు నిలిచి పోయాయి. షూటింగ్ కి వెళితే కానీ, ఆకలి తీర్చుకోలేని సినీ కళాకారుల కోసం 10 రోజుల పాటు సరిపోయే నిత్యావసర వస్తువులను రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందిచనున్నట్టు రాజశేఖర్, జీవిత దంపతులు ప్రకటించారు. 

ఈ సహాయం పొందాలి అనుకునే కష్టాల్లో ఉన్ననటి నటులు 9010810140 ఫోన్ నెంబర్ కి కాల్ చేసి తమ వివరాలు తెలిపితే తగిన సహాయం పొందే అవకాశం ఉంటుంది అని తెలిపారు. 

Post a Comment

0 Comments