త్వరలోనే స్మార్ట్ వాచ్ లాంచ్ చేయనున్న రియల్‌మీ ఫోన్ బ్రాండ్

realme-smartwatch-price-specifications-in-india.PNG (393×336)
స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన రియల్‌మీ ఇప్పుడు ఫిట్‌నెస్ బ్యాండ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ స్పీకర్లు మరియు మరిన్ని ఉత్పత్తులను ప్రణాళికాబద్ధంగా ప్రవేశ పెడుతుంది. ఫిట్నెస్ బ్యాండ్లకు ఉన్నక్రేజ్ ను గుర్తించిన ఈ కంపెనీ ఇటీవలే రియల్‌మీ ఫిట్నెస్ బ్యాండ్ ను ఇండియాలో ప్రవేశ లాంచ్ చేసింది. 

ఇప్పుడు, రియల్‌మీ తన మొదటి స్మార్ట్ వాచ్ లాంచ్ చెయ్యడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రియల్‌మీ  ఇండియా సీఈఓ మాధవ్‌ శేత్‌ తన యూట్యూబ్‌ ఛానల్ లో #AskMadhav యొక్క తాజా ఎపిసోడ్‌లో చేతికి స్మార్ట్‌వాచ్‌ను పెట్టుకోవడం కనిపించింది, అతను త్వరలో దీనిని లాంచ్ చేస్తామని ధృవీకరించాడు. 

రియల్‌మే వాచ్ గుండ్రని అంచులతో చదరపు డిజైన్‌ను కలిగి ఉంది. ఇది ఫిట్‌బిట్ వెర్సా లాగా కనిపిస్తూ, నల్ల పట్టీని కలిగి ఉంది. ఈ స్మార్ట్ వాచ్  ఒకటి కంటే ఎక్కువ వేరియంట్లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇతర స్మార్ట్ వాచ్లోలాగే దీని పట్టీలు కూడా మార్చుకొనే అవకాశం ఉంటుంది. 

రియల్‌మీ స్మార్ట్ వాచ్ ఇతర వివరాలు, ప్రైస్ మరియు లాంచ్ డేట్ ను కంపెనీ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. 

Post a Comment

0 Comments