మీడియా ను ఉతికి ఆరేసిన క్రికెటర్ భార్య

sakshi-dhoni-slams-media-for-dhoni-one-lakh-donation-news
భారత క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి ధోని శుక్రవారం ట్విట్టర్లో ధోని గురుంచి తప్పుగా ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారుకరోనావైరస్ మహమ్మారిని ఎదురుకోవడానికి దేశంలోని ప్రముఖులు విరాళాలు ఇస్తున్నవేళ ధనిక క్రికెటర్ అయిన ధోని 1 లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు అంటూ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా మెసేజ్ లు వస్తుండడంతో సాక్షి ధోనికి చిర్రెత్తుకొచ్చింది. తన ట్విట్టర్ ఖాతాలో మీడియాను తిడుతూ మెసేజ్ పెట్టింది.

ధోనికి వ్యతిరేకంగా చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. Rs 800 కోట్ల వరకు ఆస్తులు ఉన్నక్రికెటర్ కేవలం 1 లక్ష రూపాయలు ఇవ్వడం ఏంటి అంటూ కొందరు కామెంట్ చేయగా. మరొక వ్యక్తి "M.S. ధోని రూ 1 లక్ష భారీ మొత్తంలో విరాళం ఇచ్చారు" అంటూ వెటకారంగ ట్వీట్ చేసాడు. ప్రచారాన్ని అడ్డుకోవడం కోసం ధోని భార్య రంగంలోకి దిగింది. తన భర్త ధోని మీద వస్తున్న వ్యతిరేక వార్తలను ప్రచురించొద్దు అంటూ ట్విట్టర్ లో కోరింది.

"ఇలాంటి సున్నితమైన సమయాల్లో తప్పుడు వార్తలు ఇవ్వడం మానేయాలని నేను అన్ని మీడియా సంస్థలను అభ్యర్థిస్తున్నాను! షేమ్ ఆన్ యు ! బాధ్యతాయుతమైన జర్నలిజం ఎక్కడ అదృశ్యమైందో నేను ఆశ్చర్యపోతున్నాను!" అంటూ సాక్షి ధోని ఘాటుగా మీడియాకు చురకలు అంటించింది.అయితే కొరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవటానికి ధోని క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్ కెట్టో ద్వారా పూణేలోని ముకుల్ మాధవ్ ఫౌండేషన్లోని పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్కు రూ .1 లక్ష మొత్తాన్ని విరాళంగా ఇచ్చినట్లు గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. వీటిని సాక్షి ధోని ధ్రువీకరించలేదు

Post a Comment

0 Comments