హీరో పై సైబర్ క్రైమ్ లో తెలుగు సినీ నటి లావణ్య త్రిపాఠి పిర్యాదు

తెలుగు సినీ నటి లావణ్య త్రిపాఠి హీరో గా చెప్పబడుతున్న సునిషిత్ అనే వ్యక్తిపైన హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు  చేసింది. కొన్ని తెలుగు యూట్యూబ్ ఛానెల్స్ అతను పెద్ద స్టార్ లాగ చూపిస్తూ ఇంటర్వ్యూ చేసాయి. ఆ ఇంటర్వ్యూలో సునిశిత్ లావణ్య త్రిపాఠి ని పెళ్లి చేసుకున్నట్టు తెలిపాడు. 
Lavanya+Tripathi+Hot+Photo+Gallery+Latest+%284%29.jpg (620×885)
ఈ యూట్యూబ్ వీడియోలను చూసిన తరువాత, నటి లావణ్య, సునిషిత్  మరియు యూట్యూబ్ ఛానెళ్లపై  తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు సైబర్బాద్ పోలీసులకు ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది.

హీరో గా చెప్పబడుతున్న సునిషిత్  తెలుగు సూపర్ హీరో మహేష్ బాబుపై కూడా ఆరోపణలు చేశారు.

అతని ప్రకారం, సుకుమార్ అతనితో హీరోగా "1 నేనోక్కడినే " ను ప్రారంభించాడు, కాని మహేష్ బాబు అతనిని సినిమా నుండి తప్పించడానికి తన పలుకుబడిని ఉపయోగించాడు. ఆ విధంగా సుకుమార్ చిత్రంలో నటించే అవకాశాన్ని మహేష్ బాబు పొందారు అని సునిషిత్ యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. 

ఇటువంటి వీడియోలు కేవలం వ్యూస్ కోసం పెడుతున్నారని సమాచారం. చాలా వార్తల్లో నిజాలు ఉండవని సినీ విశ్లేషకులు తెలుపుతున్నారు. 

Post a Comment

0 Comments