రంగదే హీరో నితిన్ కి బర్త్‌డే విషెస్ తెలిపిన తెలుగుహిట్ టీమ్

happy-birthday-nithin.jpg (576×814)
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ బర్త్‌డే ఈ రోజు. నితిన్ తన 37 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు,  అతను 30 మార్చి 1983 న జన్మించాడు. భీష్మ తెలుగు సినిమాతో హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో నెక్స్ట్ సినిమా రంగదే! మోషన్ పోస్టర్ నిన్న రిలీజ్ అయ్యి అభిమానులను అలరించింది.

నితిన్ పుట్టినరోజు సందర్బంగా ఆయన ఫాన్స్ సోషల్ మీడియాలో సుభాకాంక్షలు తెలిపారు. ఇంతక ముందే కరోనావైరస్ సంక్షోభం వల్ల తన బర్త్‌డే సెలెబ్రేషన్స్ క్యాన్సల్ చేస్తునట్టు ఈ బర్త్డే బాయ్ తన ఫాన్స్ కి తెలిపాడు. 

భీష్మ హీరో కి చాలా మంది  ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవ్య క్రియేషన్స్ సంస్థ ప్రొడక్షన్ no 12 సినిమా వివరాలు వెల్లడిస్తూ నితిన్ కి హ్యాపీ  బర్త్‌డే అంటూ విషెస్ తెలిపింది. రంగదే హీరోయిన్ కీర్తి సురేష్ క్యూట్ గా ఈ యంగ్ హీరోకు విష్ చేసింది, అయితే ఆ ట్వీట్ కి నితిన్ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. 
కీర్తి సురేష్ ఒక రోజు ముందే  బర్త్‌డే విషెస్ తెలపండంతో నితిన్ " బర్త్‌డే రేపు అనూ(సినిమాలో పేరు).... బెస్ట్ ఫ్రెండ్ అంటావు మళ్ళీ....రేపు విష్ చేయి మళ్ళి....బాయ్" అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. 

ఇంకా నితిన్ ని బర్త్‌డే కి విష్ చేసిన వారిలో టెన్నిస్ స్టార్ గుత్తా జ్వాలా, మ్యూజిక్ డైరెక్టర్ దేవి ప్రసాద్ ఉన్నారు.  

Post a Comment

0 Comments