తెలుగు సినిమాలను థియేటర్ లో కాకుండా అమెజాన్, నెట్ఫ్లిక్ లో రిలీజ్ చేస్తారా ?

telugu-movies-will-be-directly-released-on-prime-netflix-aha-zee5
సినీ పరిశ్రమకు కరోనావైరస్ దెబ్బ పెద్దది అనే చెప్పాలి. అన్ని సినిమా షూటింగులు నిలిచిపోవడం, సినిమా థియేటర్లు మూత పడడం చాలా నష్టాన్ని కలిగించింది అనే చెప్పాలి. చిన్న, మీడియం బడ్జెట్ సినిమా నిర్మాతల కష్టాలు చెప్పలేనివి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను థియేటర్లలో కాకుండా ఆన్లైన్ స్ట్రీమింగ్ వెబ్సైట్లు అయిన ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్, ఆహా, ZEE5 లాంటి మరికొన్నిటిలో రిలీజ్ చేసే యోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తుంది.

అప్పు చేసి నిర్మిచిన సినిమా త్వరగా రిలీజ్ కాకపోతే నిర్మాతకు మిగిలేవి నష్టాలే. అయితే కరోనా వైరస్ వల్ల సినిమా థియేటర్లు ఇప్పుడు మూతపడడంతో వీరు ఏంచెయ్యాలో అర్ధం కానీ స్థితిలో ఉన్నారు. అందుకే ఇలాంటి సమయంలో థియేటర్లో కాకుండా డైరెక్టుగా ఆన్లైన్లో రిలీజ్ చెయ్యాలి వీరు ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒక వేళ అదే జరిగితే ఇది టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ అనే చెప్పాలి.

ఇండియాలో ఇలా చెయ్యకపోయినా విదేశాల్లో netflix ఎక్సక్లూసివ్ సినిమాలు కొన్ని థియేటర్లో కాకుండా ఆన్లైన్లోనే రిలీజ్ అవుతాయి. అయితే పెద్ద బడ్జెట్ సినిమాలకు ఈ విధానం లాభదాయకం కాదు కాబట్టి ఫాన్స్ థియేటర్లో ఎంజాయ్ చెయ్యొచ్చు. 

Post a Comment

0 Comments