కరోనావైరస్ తో పాకిస్తానీ క్రికెటర్ సర్ఫరాజ్ మృతి

pakistani-cricketer-sarfaraz-dies-due-to-coronavirus-in-peshawar
కరోనావైరస్ భారిన పడి పాకిస్తానీ మాజీ క్రికెటర్ ఒకరు మృత్యువాత పడ్డారు. మంగళవారం COVID-19 తో 50 సంవత్సరాల పాకిస్తాన్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన జాఫర్ సర్ఫరాజ్ కన్నుమూశారు. 1988 లో క్రికెట్లోకి అడుగుపెట్టిన ఈయన పెషావర్ టీం తరఫున ఆడి 6 వన్డేల్లో 96 పరుగులు చేసాడు, 15 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 616 రన్స్ చేసాడు. 1994 లో రిటైర్మెంట్ తరువాత అతను 2000 ల మధ్యలో సీనియర్ మరియు అండర్ -19 పెషావర్ జట్లకు క్రికెట్  కోచింగ్  చేసాడు. 

పాకిస్తాన్ లోని పెషావర్ లో ఒక ఆసుపత్రిలో గత 3 రోజులనుండి ఐసీయూలో చికిత్స పొందుతున్న జాఫర్ సర్ఫరాజ్ ఈ రోజు ఉదయం మృతి చెందారని సమాచారం. 

జాఫర్ పాకిస్తాన్ అంతర్జాతీయ ఆటగాడు అక్తర్ సర్ఫ్రాజ్ సోదరుడు. పెద్దప్రేగు క్యాన్సర్‌తో 10 నెలల క్రితం అఖ్తర్ కన్నుమూశారు. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌కు ఉత్తరాన ఉన్న పెషావర్లో  దాదాపు 5500 క్రియాశీల కేసుల్లో 744 ఉన్నాయి .

Post a Comment

0 Comments