రిషబ్ పంత్ కు అంత సీన్ లేదు : రోహిత్ శర్మ

rohit-sharma-slams-rishab-pant-for-sixer-challenge.PNG (640×530)
యువ వికెట్ కీపర్, బ్యాట్సమెన్ అతిపెద్ద సిక్సర్ కొట్టడంలో తనను సవాలు చేశాడని తెలుసుకున్న ఇండియా క్రికెటర్ రోహిత్ శర్మ బుధవారం రిషబ్ పంత్ కు పంచ్ వేశాడు. 

నిన్న జరిగిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో, జస్‌ప్రీత్ బుమ్రా రోహిత్‌తో మాట్లాడుతూ, పంత్ ఈ మధ్య అతిపెద్ద సిక్స్‌ను  మీ ఇద్దరిలో ఎవరు కొట్టగలరో చూద్దామని సవాలు చేశాడని చెప్పడంతో రోహిత్ ఒక పంచ్ డైలాగ్ తో రిషబ్ పంత్ కు చురకలు అంటించాడు. 

భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఈ సవాలును కామెడీ చేస్తూ : "మేరే సాత్ ఉస్కో కర్నా హై? ఏక్ సాల్ హువా నహి ఉస్కో క్రికెట్ ఖెల్కే, చక్కే కా కాంపిటీషన్ కర్ రాహా హై (అతను నాతో పోటీ చేయాలనుకుంటున్నాడా? అతను క్రికెట్ ఆడి ఒక్క సంవత్సరం కూడా కాలేదు?  సిక్సులు పోటీ చేయెయ్యలంటున్నాడు.)" అంటూ రిషబ్ పంత్ పైన ఒక పంచ్ డైలాగ్ వేసాడు. 

రోహిత్ ఇప్పటివరకు 346 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల్లో 423 సిక్సర్లు కొట్టగా, పంత్ ఇప్పటివరకు భారత్ తరఫున ఆడిన 56 ఆటలలో 47 సిక్సులు కొట్టాడు. 

Post a Comment

0 Comments