బిగ్‌బాస్‌ను పిచ్చిగా తిట్టిన అభయ్‌కు, నాగార్జున రెడ్ కార్డు ఇచ్చి హౌస్ నుండి బయటకు పంపించాడు Bigg Boss 8 Telugu

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షో బిగ్‌బాస్ 8వ సీజన్ 20వ రోజుకు చేరుకుంది. మొదటి వారంలో బేబక్క ఎలిమినేట్ కాగా, రెండవ వారంలో శేఖర్ భాషా హౌస్ విడిచారు. ఈ వారం ఎవరిని ఎలిమినేట్ చేస్తారన్నది ప్రేక్షకులు, బిగ్‌బాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో, ఈ రోజు ప్రసారమయ్యే స్పెషల్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ప్రోమోలో కంటెస్టెంట్ అభయ్, బిగ్‌బాస్‌ను తీవ్రంగా విమర్శిస్తూ, అసభ్య పదజాలంతో వ్యంగ్యాస్త్రాలు సంధించడం చూపించబడింది, ఇది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

బిగ్‌బాస్‌లో గుడ్ల టాస్క్ ముగిసిన తరువాత కూడా అభయ్ తన ఆగ్రహాన్ని నియంత్రించకుండా, తన రూమ్‌లోకి వెళ్లి బిగ్‌బాస్‌పై తీవ్రమైన విమర్శలు కొనసాగించాడు. "బిగ్‌బాస్ కాదు, నువ్వు పక్షపాత బాస్. నేను చెప్పింది కట్ చేస్తారేమో గానీ, బయటకెళ్లాక కూడా ఇంటర్వ్యూలో ఇదే చెప్తా. నిజంగా నీకు ధమాక్ లేదు. ఒకరికీ రూల్స్, మరొకరికీ లేదు. ఇదేం అసహ్యమైన గేమ్, నాకు అర్థం కాలేదు. నిద్రపోయావా? లేక గతం మర్చిపోయావా? నువ్వు లిమిట్‌లెస్ పక్షపాతి, బిగ్‌బాస్," అంటూ అభయ్ తీవ్ర ఆవేదనతో వ్యాఖ్యానించాడు.

ఈ పరిణామం తరువాత, అభయ్‌కి బిగ్‌బాస్ నుండి వార్నింగ్ మాత్రమే కాకుండా, నాగార్జున రెడ్ కార్డ్ జారీచేసి హౌస్ నుండి వెళ్లిపోవాలని ఆదేశించారు. "ఇది బిగ్‌బాస్ హౌస్. ఇక్కడ బిగ్‌బాస్ రూల్స్ మాత్రమే ఉంటాయి. బిగ్‌బాస్‌పై గౌరవం లేకుంటే, బయటకు వెళ్లిపోవచ్చు. నేను నీకు రెడ్ కార్డ్ ఇస్తున్నా. బిగ్‌బాస్, డోర్స్ ఓపెన్ చేయి. అభయ్, గెట్ ఆవుట్," అంటూ నాగార్జున ప్రోమోలో ఖచ్చితంగా చెప్పడం చూపించబడింది.

Post a Comment

0 Comments