మలేషియా నుండి భారతదేశానికి తిరిగి వస్తున్న150 మంది తెలుగు విద్యార్థులు

కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తరువాత మలేషియాలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు ఆ దేశం నుండి భారతదేశానికి బయలుదేరారు. సుమారు 150 మంది విద్యార్థులు మలేషియా నుండి రాలేక ఇన్ని రోజులు ఎన్నో అవస్థలు పడ్డారు. 
telugu-students-to-return-from-malaysia.PNG (340×311)
మంగళవారం నుండి మలేషియా ఎయిర్పోర్ట్ లో వేచిఉన్న విద్యార్థులు, అక్కడి ప్రభుత్వం రాజధాని కౌలాలంపూర్ నుండి ఢిల్లీ మరియు విశాఖపట్నం కు ఎయిర్ ఆసియ ప్లేన్ లను అనుమతించడంతో ఎట్టకేలకు తెలుగు విద్యార్థులు భారత దేశానికి వస్తున్నారు. 

పలు దేశాలలో చిక్కుకున్న భారతీయుల సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక హెల్ప్లైన్ నెంబర్ ను ప్రకటించింది. 
ఫోన్ నంబర్ 011-24300666 మరియు ఇమెయిల్ ఐడి support.covid19-boi@gov.in అని హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి ట్వీట్ చేశారు.

కరోనావైరస్ నేపథ్యంలో వీసా మరియు విదేశీ ప్రయాణికుల సహాయం కోసం భారత ప్రభుత్వ హెల్ప్లైన్ నెంబర్

ఈ సేవలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అందిస్తుంది.  24 గంటలు ఈ వ్యవస్థ  అందుబాటులో ఉంటుంది.

Post a Comment

0 Comments