భారతదేశ వ్యాప్తంగా అమలు అవుతున్న జనతా కర్ఫ్యూ

మార్చి 22 నాటికి భారతదేశంలో కనీసం 330 COVID-19 కేసులు నిర్ధారించబడ్డాయి, వీటిలో 300 కి పైగా క్రియాశీల కేసులు ఉన్నాయి. COVID-19 తో ఇప్పటి వరకు నలుగురు మరణించారు. కేంద్రం ప్రకారం, దేశంలో ఇంకా సమాజ ప్రసారానికి ఆధారాలు లేవు.
india-janata-curfew-telugu-news.PNG (345×333)
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో సామాజిక దూరాన్నిపాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన 'జనతా కర్ఫ్యూ'ను ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు భారతదేశం పాటిస్తోంది.

COVID-19 కు వ్యతిరేకంగా పోరాటం విజయవంతం చేయడానికి ‘జనతా కర్ఫ్యూ’ లో చేరాలని మార్చి 22 న ప్రధాని నరేంద్ర మోడీ ఈ  ఉదయం ట్విట్టర్ ద్వారా అభ్యర్థించారు.

జనతా కర్ఫ్యూ అనేది 20 వ, 21 వ శతాబ్దంలో జన్మించిన చాలా మందికి కొత్తగా అనిపించే అవకాశం ఉండొచ్చు. కానీ భారతదేశ స్వాతంత్ర పోరాట సమయాల్లో ప్రజలు ఇలాంటి పరిణామాలు ఎదురుకున్నారు. 

ట్రైన్లు, అన్ని ప్రజా రవాణా సేవలు నిల్చి పోవడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూ కొనసాగుతుంది. తెలంగాణలో పోలీసులు కారులో తిరుగుతూ ప్రజలు ఎవ్వరు రోడ్ల మీదుకు రావొద్దు అని చెబుతుండడం కనిపించింది. అటు ఆంధ్రప్రదేశ్ లోను ప్రజలు స్వచ్చందంగా "జనతా కర్ఫ్యూ" లో పాల్గొంటున్నారు. ఎప్పుడు ప్రజలతో కిక్కిరిసి ఉండిపోయే రహదారులు పూర్తిగా నిర్మానుష్యం అయ్యాయి.  

Post a Comment

0 Comments