ఢిల్లీలో సెక్షన్ 144 తో CAA వ్యతిరేక శిబిరాలను తొలగించిన పోలీసులు

anti-caa-protesters-in-shaheen-bagh-removed.PNG (469×217)
కరోనావైరస్ లేదా COVID-19 పై దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన వేళ, ఢిల్లీ లోని షాహీన్ బాగ్ లో పౌరసత్వం (సవరణ) చట్టం లేదా CAA కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న ఆందోళకారులను పోలీసులు ఈ రోజు ఉదయం శిబిరాల నుండి పంపించి వేశారు. 

ఉదయం 7 గంటలకు పోలీసులు నిరసన స్థలానికి చేరుకున్నారు. నిరసనకారులకు పదే  పదే నిరసన శిబిరాన్ని కాళీచేయాలని చెప్పినప్పటికీ వినకపోవడంతో, పోలీసులు వారిని బలవంతంగా అక్కడనుండి తొలిగించారు. ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులు సహా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీలో సెక్షన్ 144 కింద పెద్ద సమావేశాలు నిషేధించబడ్డాయి. మునిసిపల్ సిబ్బంది సహాయంతో నిరసన స్థలం శుభ్రం చేయబడుతుంది, అని ఒక అధికారి అన్నారు. నగరంలోని ఇతర ప్రాంతాలలో జాఫ్రాబాద్ (ఈశాన్య ఢిల్లీ ) మరియు తుర్క్మాన్ గేట్ (ఓల్డ్ ఢిల్లీ) లో సిఎఎకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నశిబిరాలను కూడా ఈ ఉదయం తొలగించారు. 

Post a Comment

0 Comments