భారతదేశంలో పాజిటివ్‌గా నిర్దారించబడిన కోవిడ్ -19 కేసుల సంఖ్య బుధవారం 170 దాటింది

భారతదేశంలో పాజిటివ్‌గా నిర్దారించబడిన  కోవిడ్ -19 కేసుల సంఖ్య బుధవారం 170 దాటింది. చండీగఢ్ నుండి మొదటి కేసు  నమోదు కాగా కాశ్మీర్ లోయ నుండి మరొక కేసుతో సహా 150 కి పైగా క్రియాశీల కేసులు ఉన్నాయి.
coronavirus-cases-in-india-reach-170.PNG (362×256)
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం మార్చి 18 నాటికి 166 దేశాల్లో 2,07,860 కోవిడ్ -19 కేసులు నమోదు అవ్వగా  8,657 మరణాలు నమోదయ్యాయి.

ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ పాజిటివ్ కేసు నమోదైంది, ప్రకాశం జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి పరీక్షలు చేయగా పాజిటివ్ గా తేలింది, జిల్లాలో 13 మందిలో కోవిడ్ లక్షణాలు గుర్తించారు.

పంజాబ్ మరియు హర్యానా సంయుక్త రాజధాని చండీగఢ్ లో COVID-19 యొక్క మొట్టమొదటి కేసు నమోదైంది. అయితే రోగి పరిస్థితి ‘స్థిరంగా’ ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.


Post a Comment

0 Comments