ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ చెయ్యడానికి లాస్ట్ డేట్ జూన్ 30, 2020

link-Aadhar-card-to-pan-card-last-date
ఆధార కార్డు పాన్ కార్డ్ లింక్ లాస్ట్ డేట్ 
కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఆధార్ కార్డును పాన్ కార్డుతో అనుసంధానించే గడువును 2020 జూన్ 30 వరకు పొడిగిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. దీనికి మునుపటి గడువు 2020 మార్చి 31.

2018-18 ఆర్థిక సంవత్సరానికి ఐటిఆర్ దాఖలు చేసే గడువును 2020 జూన్ 30 వరకు పొడిగించారు. ఆలస్యం చెల్లింపుపై వడ్డీని కూడా అంతకుముందు ఉన్న12 శాతం నుండి 9 శాతానికి తగ్గించారు. పాన్‌తో ఆధార్ కార్డును అనుసంధానించే గడువు గత 18 నెలల్లో ఇప్పటికే 7-8 సార్లు పొడిగించబడింది. కరోనావైరస్ భయాల మధ్య, ప్రజలకు పెద్ద ఎత్తున ఉపశమనం కలిగించడానికి మళ్ళీ ఈ గడువును ప్రభుత్వం పొడిగించింది. 

Post a Comment

0 Comments