హీరోయిన్ శ్రియ భర్తకు కరోనావైరస్ సోకిందా ?

actress-shriya-saran-husband-coronavirus-in-spain.PNG (671×444)
తెలుగు సినిమా హీరోయిన్ శ్రియ సరన్ భర్తకు కరోనా లక్షణాలు బయటపడ్డట్టు నటి ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. స్పెయిన్ దేశంలోని బర్చేలోనాలో తన భర్త ఆండ్రీ కొచ్చిన్ తో కలిసి ఉంటున్నఈ హీరోయిన్ ఈ విషయాన్నితెలిపింది. 

2018 లో సీక్రెట్ పెళ్లి చేసుకున్న శ్రియ అప్పటినుండి ఎక్కువగా స్పెయిన్ దేశంలోనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ దేశంలో కరోనావైరస్ భారీగా వ్యాపించడంతో చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లోఉన్నారు. 

పొడి దగ్గు, జ్వరం తో బాధపడుతున్న శ్రియ భర్తను ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించి చికిత్స అందించిన సిబ్బంది కొన్ని రోజులు ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉండమని సూచించినట్లు తెలిపింది. ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్టు హీరోయిన్ శ్రియ తెలిపింది. 

నేటివరకు స్పెయిన్ లో 170,099 కరోనావైరస్ కేసులు మరియు 17,756 మరణాలు నమోదు అయ్యాయి. ఆ దేశం తీవ్రంగా దెబ్బతిన్నది. 

Post a Comment

0 Comments