రాజమౌళి, jr ఎన్టీఆర్, రాంచరణ్ తేజ RRR సినిమా షూటింగ్ స్పాట్ లో |
జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ తేజ్ నటిస్తున్నమెగా సినిమా RRR షూటింగ్ ఇప్పుడు వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే. అయితే RRR రిలీజ్ డేట్ గురుంచి క్రేజీగా ఎదురు చూస్తున్న ఫాన్స్ కి ఇప్పుడు ఆ సినిమా నిర్మాత డివివి దానయ్య కొంచెం క్లారిటీ ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ ఫాన్స్, రాంచరణ్ తేజ్ ఫాన్స్ తమ ఫేవరైట్ హీరోల సినిమా డేట్ కన్ఫర్మ్ కావడంతో ఇప్పుడు రిలాక్స్ అయ్యారు. 300 కోట్ల బడ్జెట్ సినిమా ఎలా ఉంటుందోనని ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.
రాంచరణ్, DVV దానయ్య |
అసలు ఈ సినిమా జులై 30, 2020 లో రిలీజ్ కావలసి ఉండే కానీ అనుకోని కారణాల వలన ఈ హై బడ్జెట్ సినిమాని వచ్చే సంవత్సరం జనవరి 8 కి వాయిదా వేశారు. ఇప్పుడు కరోనావైరస్ వల్ల RRR సినిమా షూటింగ్ నిలిచిపోవడంతో, మళ్ళీ ఈ ఫిలిం రిలీజ్ డేట్ వాయిదా పడుతుందేమో అని టాలీవుడ్ న్యూస్ సర్కిల్స్ లో వినిపించింది. అయితే నిర్మాత DVV దానయ్య క్లారిటీ ఇస్తూ సినిమా రిలీజ్ డేట్ వాయిదాపడే అవకాశమేలేదు ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా గ్రాఫిక్ వర్క్ కూడా పూర్తి అయ్యింది, ముందుగా చెప్పినట్టే జనవరి 8 వ తేదీన వస్తుంది అన్నారు.
ఇక RRR సినిమా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తీసిన భారీ సినిమా “బాహుబలి” లాగానే తాజా వెంచర్ “RRR” (రౌడ్రామ్ రనం రుధిరమ్) కూడా భారీ బడ్జెట్ సినిమానే. ఈ సినిమాలో జూనియర్ ఎన్టిఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, ఒలివియా మోరిస్ కూడా నటిస్తున్నారు.
0 Comments