రేపు ఉదయం ప్రజలకు వీడియో మెసేజ్ ఇవ్వనున్న ప్రధాని మోడి

narendra-modi-to-give-short-video-message-tomorrow-morning
భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి రేపు ఉదయం 9 గంటలకు ఒక చిన్న వీడియో మెసేజ్ ను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు షేర్ చేస్తానని ట్విట్టర్ లో తెలిపారు. అయితే ఇప్పుడు మోడి రేపు ఎటువంటి వార్తను చెబుతారో అని ప్రజలు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. 

అంతకముందు ఈ రోజు ఉదయం శ్రీ రామనవమి సందర్బంగా దేశ ప్రజలందరికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.

COVID-19 మహమ్మారి వ్యాప్తి నిరోధించే చర్యలపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఈ  రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా COVID-19 రోగుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, వ్యాధి వ్యాప్తి గొలుసును విచ్ఛిన్నం చేయడానికి 21 రోజుల లాక్డౌన్లో భారతదేశం ఉండంతో ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ప్రాముఖ్యత ఏర్పడింది. 

Post a Comment

0 Comments