క్రికెటర్లు యువరాజ్, హర్భజన్ సింగ్ లను ఉతికి ఆరేసిన నెటిజన్స్, ఎందుకో తెలుసా ?

yuvraj-harbhajan-singh-slammed-for-doantions-to-pak-shahid-afridi.png (477×576)
కరోనావైరస్ పై పోరాడటానికి షాహిద్ అఫ్రిది ఫౌండేషన్ కు మద్దతు ఇవ్వాలన్ననిర్ణయం తరువాత టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, భారత్ మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. నెటిజన్లు వీరిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఫౌండేషన్‌కు విరాళాలు ఇవ్వమని మొదట హర్భజన్ సింగ్ తన అభిమానులను కోరిన తరువాత యువరాజ్ సింగ్ విరాళం ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఇతరులను కూడా డొనేట్ చేయమని అడిగారు.

దీంతో తీవ్రంగా ఆగ్రహించి భారత్ అభిమానులు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ కు వ్యతిరేకంగా ట్విట్టర్ లో పెద్ద ఎత్తున #ShameOnYuviBhajji అంటూ మెసేజ్ లు పెడుతున్నారు. షాహిద్ అఫ్రిది భారతదేశ వ్యతిరేకి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

గతంలో కాశ్మీర్ పై భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన షాహిద ఆఫ్రిదికి యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ మద్దతు పలకడంతో పెద్ద చర్చకు దారితీసింది. ఒక వ్యక్తి అయితే "పాకిస్తాన్‌లో నివసించే హిందువులను కూడా ఎలాంటి వివక్ష లేకుండా చూసుకోవాలని ఆయనను అడగండి" అంటూ యువి, భజ్జి లకు చురకలు అంటించాడు. షాహిద్ ఆఫ్రిది ఫౌండేషన్ కంటే మన దేశం యొక్క PMCares ఫండ్ కు ఎందుకు దానం చేయకూడదు? అంటూ ఇంకొక వ్యక్తి వారిని ప్రశ్నించాడు.

మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు, నువ్వూ మరియు నా సోదరుడు హర్భజన్ సింగ్ మద్దతుకు మూల స్తంభాలు; మనకు ఉన్నఈ బంధం ప్రేమ, శాంతిని చూపిస్తుంది అంటూ హర్భజన్, యువరాజ్ లకు షాహిద్ ఆఫ్రిది థాంక్స్ చెప్పడం కొసమెరుపు. 

Post a Comment

0 Comments