కొరోనా వైరస్ కట్టడి కోసం ఆoధ్రప్రదేశ్ విద్యా సంస్థలకు మార్చ్ 19 నుండి సెలవులు

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపటి నుండి అంటే మార్చ్ 19 నుండి రాష్ట్రంలోని అన్ని స్కూల్స్, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. తాడేపల్లి లోని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం లో సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్రానికి సంబందించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్ ని కట్టడి చెయ్యడంలో అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.  ఈ  సమావేశం తరువాత మార్చ్ 19, గురువారం నుండి ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు, ట్యూషన్ మరియు అన్ని విద్యాసంస్థలు మూసివేయాలని ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. 
andhra-pradesh-schools-close-from-march-19-2020.PNG (329×215)
ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారికంగా ప్రకటించారు. మళ్ళీ విద్యా సంస్థలు ఎప్పుడు తెరుస్తారో తరువాత ప్రకటించే అవకాశం ఉంది. హాస్టల్స్ లో ఉన్న విద్యార్థులను జాగ్రత్తగా ఇంటికి పంపిస్తామని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ 10 వ తరగతి పరీక్షలు మాత్రం యధాతదంగ టైం టేబుల్ ప్రకారం జరుగుతాయని ప్రకటించారు. 

ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాలు విద్యాలయాలను మూసివేశాయి. 

Post a Comment

0 Comments