జనతా కర్ఫ్యూకి సంగీభావం తెలిపిన ఆంధ్రప్రదేశ్ సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి

కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ఇండియా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన జనతా కర్ఫ్యూ కి సంగీభావం తెలుపుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. covid-19 ని అరికట్టడానికి, మార్చ్ 22 న ఉదయం 7 నుండి రాత్రి 9 వరకు ప్రజలు అందరూ ఇంట్లోనే ఉండాలని కోరుతూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 
ap-cm-jagan-mohanreddy-supports-janata-curfew-teluguhit.png (435×414)


అతి ముఖ్యమైన పనులలో పాల్గొనే ఉద్యోగులు అంటే వైద్య సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, పాల సరఫరాదారులు మరియు విద్యుత్ సిబ్బందితో పాటు ఎమర్జెన్సీ సేవల్లోని ఉద్యోగులు తప్ప మిగతా అందరూ ప్రజలు ఇంట్లోనే ఉండాలని కోరారు. 

ఎమర్జెన్సీ సేవల్లో పాల్గొనే ఉద్యోగులను అభినందిస్తూ, వారి కృషిని గుర్తిస్తూ ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రజలందరు ఇంటి ద్వారాల వద్ద, కిటికీలు, బాల్కనీ వద్ద నిల్చొని 5 నిమిషాల పాటు చప్పట్లు కొట్టాలని కోరారు. 

Post a Comment

0 Comments