ఇప్పటివరకు ఇండియాలో 873 కరోనా పాజిటివ్ కేసులు, 20 మరణాలు

india-coronavirus-latest-updates.PNG (314×328)
COVID -19 వ్యాధి వ్యాప్తిని అరికట్టే ఉద్దేశంతో దేశం మూడు వారాల నిర్బంధంలోకి వెళ్ళిన తరువాత శనివారం భారతదేశంలో పాజిటివ్ కరోనావైరస్ కేసుల సంఖ్య 873 ను తాకింది.

కరోనావైరస్ అనుమానితులను పరీక్షించగా, 149 మందికి పాజిటివ్ గా తేలింది దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 873 కు చేరిందని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి దేశంలో ఒకే రోజు నమోదైన కేసుల్లో ఇదే అతి పెద్ద సంఖ్య. 

కొరోనావైరస్ వలన అధికారికంగా నివేదించబడిన లెక్కల ప్రకారం, పాజిటివ్ కేసులు మరియు మరణాలు తక్కువ సంఖ్యలో ఉన్న దేశాలలో భారతదేశం ఉంది. శనివారం నాటికి మొత్తం 20 మంది మరణించారు. వ్యాధి వ్యాప్తిని నిరోధించే ఉద్దేశ్యంతో మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రంలో 59 కేసులు, ఆంధ్రప్రదేశ్ లో 13 కరోనావైరస్ పాజిటివ్ కేసులు మార్చ్ 28 వరకు నమోదు అయ్యాయి. 

Post a Comment

0 Comments