కరోనావైరస్ తో ఇటలీలో ఒకే రోజు 793 మంది మృతి

కరోనావైరస్ దెబ్బకు అతలాకుతలం అవుతున్న ఇటలీ దేశంలో గడిచిన 24 గంటలలో 793 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు COVID-19 వలన మరణించిన వారి సంఖ్య 4825 కు చేరింది, ఇది చైనాలో మరణించిన వారి సంఖ్య కంటే ఎక్కువే. మొత్తంమీద, ఇటలీలో పాజిటివ్ గా ధృవీకరించబడిన కేసుల సంఖ్య 53,578 అని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాలు చెబుతున్నాయి.
793-people-die-in-a-single-day-in-italy.png (525×392)

గురువారం ఇటలీలో సంభవించిన మరణాలతో కొరోనావైరస్ తో జరిగిన మరణాలలో చైనా ని అధిగమించింది. ఇటలీ లోని లొంబార్డి తీవ్రంగా దెబ్బతింది ,47% పాజిటివ్ కేసులు ఈ ప్రాంతం నుండి వచ్చాయి. 

ఇంటెన్సివ్ కేర్ అవసరమయ్యే రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది, దేశంలోని వైద్య వ్యవస్థ బ్రేకింగ్ పాయింట్‌కు చేరుకుంటుంది, వైరస్ వ్యాప్తిని ఆపడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలను కూడా అమలు చేసింది. 

దేశవ్యాప్తంగా శుక్రవారం 2,23,633 మందిని ఇటాలియన్ పోలీసులు తనిఖీ చేశారు. 9888 మంది లాక్డౌన్ చర్యలను ఉల్లంఘించినట్లు మరియు 260 మంది వారు బయట ఎందుకు ఉన్నారనే దానిపై తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఇటాలియన్ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది.

Post a Comment

0 Comments