హైదరాబాద్ ప్రజలకు రవాణా సేవలు అందిస్తున్న హైదరాబాద్ మెట్రో తొలిసారిగా తన సర్వసులను రేపు పూర్తిగా నిల్పివేయనుంది. కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యలలో భాగంగా భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన "జనతా కర్ఫ్యూ" నేపథ్యంలో ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
అత్యవసర సేవా సిబ్బంది మినహా ఇతర ప్రజలు ఎవరు రేపు బయట తిరుగొద్దని ప్రభుత్వం కోరింది. తెలంగాణ సీఎం కెసిఆర్ మరియు ఆంధ్రప్రదేశ్ సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి "జనతా కర్ఫ్యూ" కి సంగీభావం తెలిపారు. ఏవైతే ప్రభుత్వం సూచనలు ఉన్నాయో వాటి తప్పక పాటించాలని కోరారు.
హైదరాబాద్ మెట్రో సేవలు ఎల్లుండి తిరిగి సేవలను ప్రారంభిస్తుంది. ప్రస్తుతం కరోనావైరస్ నేపథ్యంలో చాలా సంస్థలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్, సెలవులు ప్రకటించడంతో మెట్రో లో ప్రయాణికులు తగ్గారు. దాంతో ట్రైన్ ఫ్రీక్వెన్సీ ని కూడా సంస్థ తగ్గించింది.
0 Comments