హైద్రాబాదులో IKEA స్టోర్ మూసివేత, ఆన్లైన్ షాపింగ్ కూడా బంద్

స్వీడన్ కు చెందిన అంతర్జాతీయ IKEA సంస్థ హైదరాబాద్ నగరంలోని తన ఏకైక దుకాణాన్నితాత్కాలికంగా మూసివేస్తామని గురువారం తెలిపింది. దేశంలో కోవిడ్ -19 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మార్చి 20 నుండి ఉద్యోగులు మరియు కస్టమర్ల శ్రేయస్సు కోసం ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే వినియోగదారులు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయగలుగుతారు.
ikea-closes-hyderabad-store-but-online-shopping-open
2018 లో హైదరాబాద్ నగరంలో తన దుకాణాన్ని తెరిచిన IKEA ఇండియా, తదుపరి నోటీసు వచ్చేవరకు స్టోర్ మూసివేయబడుతుందని తెలిపింది. దీనితో, స్వీడన్ ఫర్నిచర్ రిటైలర్ తన పెద్ద-ఫార్మాట్ దుకాణాలను మూసివేసిన తాజా దేశంగా భారత్ నిలిచింది. 

భారతదేశంలో ఆన్‌లైన్ సేవలను అందించే ఉద్యోగులు శుభ్రమైన పని వాతావరణం మరియు సురక్షితమైన సామాజిక దూరంలో పనిచేసేలా బలమైన చర్యలు తీసుకుంటామని ఐకియా చెప్పింది. 

IKEA హైదరాబాద్ స్టోర్ ని తదుపరి నోటీసు వచ్చేవరకు మూసివేస్తున్నట్టు సంస్థ కస్టమర్స్ కి ఇమెయిల్ ద్వారా సమాచారం అందించింది.

new update : 24/03/2020

హైద్రాబాద్లోని IKEA స్టోర్ తమ ఆన్లైన్ సేవలను కూడా తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయయించింది. ఈ మేరకు కస్టమర్లకు sms ద్వారా సమాచారాన్ని తెలిపింది. 

Post a Comment

0 Comments