రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తన పాలసీ రేట్లను తగ్గించడంతో చిన్నపొదుపు పథకాలపై వడ్డీ మంగళవారం నుండి తగ్గనున్నది . ఈ పధకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ఏప్రిల్-జూన్ వరకు 70-140 బిపిఎస్‌ల మధ్య సవరించింది. కరోనావైరస్ వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవటానికి, ఆర్‌బిఐ ఇటీవల తన కీలక వడ్డీ రేటులో 75 బిపిఎస్‌ల తగ్గింపును ప్రకటించింది.
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) లో 80 బిపిఎస్ వడ్డీ రేటును తగ్గించిన తరువాత 7.1% రాబడిని పొందుతుంది, ఇంతకముందు PPF డిపాజిటర్లకు 7.9% రాబడి వచ్చేది.
- నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై వడ్డీ రేటు 110 బిపిఎస్‌ల నుంచి 6.8 శాతానికి తగ్గించబడింది.
- కిసాన్ వికాస్ పత్రాపై వడ్డీ రేటు 70 బిపిఎస్ తగ్గడంతో వడ్డీ 6.9 శాతానికి తగ్గనున్నది, ఇది 124 నెలలకు మెచ్యూరిటీ అవుతుంది. 5 సంవత్సరాల సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ పథకానికి వడ్డీ రేటు 120 బిపిఎస్‌ల నుండి 7.4 శాతానికి తగ్గించబడింది, అంతకుముందు ఇది 8.6 శాతంగా ఉంది, అయితే సేవింగ్స్ డిపాజిట్ల వడ్డీ 4% గా ఉంది, దీనిని మార్చలేదు. సీనియర్ సిటిజన్స్ పథకానికి వడ్డీని త్రైమాసికంగా చెల్లిస్తారు.
వడ్డీ రేట్లు తగ్గించడం వలన చాలా మంది వృద్దులు, స్త్రీలు ఇబ్బందికి గురిఅయ్యే అవకాశం ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్లు, చిన్న మొత్తాల పొదుపు పథకాల ద్వారా వచ్చే వడ్డీతో తమ ఖర్చుల వెళ్లదీసేవారికి ఇది కఠినంగా ఉండవచ్చు.
0 Comments