తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్, జీతాల్లో కోతలు, ఎవరికెంతో తెలుసా ?

telnagna-govt-cuts-salaries-of-employees-and-pensioners.png (637×238)
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది, వారి జీతాల్లో కోతలు విధించనుంది. ఈ రోజు ప్రగతిభవన్ లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కరోనావైరస్ సంక్షోభం తో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నందున అందరు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్ల వేతనాల్లోను కోత విధించనున్నారని సిఎం కార్యాలయం ప్రకటించింది. 

ఎవరి జీతాల్లో ఎంత కోత  ?

  • ముఖ్యమంత్రి , ఎమ్మెలేలు, ఎమ్మెల్సీలు , స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల వేతనాల్లో పెద్ద ఎత్తున 75 శాతం కోత ఉంటుంది. 
  • సివిల్ సర్వీసెస్ ఉద్యోగులైన ఐఏఎస్, ఐపిస్, ఐఎఫ్ఎస్ మరియు ఇతర అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల జీతాల్లో 60 శాతం కట్టింగ్ ఉంటుంది. 
  • ఇతర అన్ని కేటగిరిలోని ఉద్యోగులకు 50 శాతం సాలరీలో కోతలు ఉంటాయి. 
  • నాలుగవ తరగతి ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో అందరి కంటే తక్కువగా 10 శాతం కోత విదించనున్నట్టు   తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. 
  • తెలంగాణ ప్రభుత్వ నాలుగవ తరగతి రిటైర్డ్ ఎంప్లాయిస్ కి పెన్షన్లలో 10 శాతం కట్ అవుతుంది. 
  • మిగతా అందరు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లలో 50 % కట్ అవుతుంది. 
అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులతో పాటు, ప్రభుత్వ గ్రాంట్ పొందుతున్న సంస్థల్లోని ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా జీతాల్లో కోతలు ఉంటాయని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.  

చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు నెల జీతంతోనే తమ కుటుంబ అవసరాలు తీరుస్తారు. అసలే కరోనావైరస్ నేపధ్యంలో కొన్ని ఖర్చులు పెరిగిన నేపథ్యంలో తమ వేతనాల్లో కోత విధించడాన్ని ఉద్యోగుల ఏవిందగా తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Post a Comment

0 Comments