UK లో స్కూల్స్ బంద్, ఉద్యగులకు వర్క్ ఫ్రఅం హోమ్

కరోనావైరస్ మహమ్మారికి ప్రతిస్పందనగా UK లోని పాఠశాలలు శుక్రవారం నుండి తదుపరి నోటీసు వరకు మూసివేయబడతాయి.
uk+schools+closed+bcause+of+coronavirus.PNG (321×265)

ముఖ్యమైన  పనులు నిర్వహించె మరియు ఆరోగ్యం సరిగా లేని పిల్లలను చూసుకోవడం మినహా పాఠశాలలు మూసివేయబడతాయని , ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు.

ఈ విద్యాసంవత్సరం పరీక్షలు ఇంగ్లాండ్ మరియు వేల్స్లో జరగవు, యునైటెడ్ కింగ్డంలో భాగమైన  స్కాట్లాండ్ మరియు ఉత్తర ఐర్లాండ్‌లో నిర్ణయాలు తీసుకోనున్నారు.

ప్రస్తుతం ఇంగ్లాండ్ లో కరోనా మరణాల సంఖ్య 104 గా  ఉంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతుండడంతో అక్కడి ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. 

UK లో ఉంటున్న ప్రవాస భారతీయులు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే దాదాపు అన్ని కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫరం హోమ్ సౌలబ్యాన్ని కల్పించాయి. 

ఇండియా లో కరోనా వైరస్ భయాలు ఇప్పటికి అంతగా లేకున్నా, UK లో మాత్రం ప్రజలు కరోనా భయంతో పెద్ద ఎత్తున్న నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి ఇంట్లో దాచుకుంటున్నారు. దాదాపు UK లోని అన్ని దుకాణల్లో చాలా వాముఖ్యమైన వస్తువులు లభించడం లేదు. 

Post a Comment

0 Comments