సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఇంట్లో పాము కలకలం, దాన్ని ఏం చేశారో తెలుసా ?

snake-in-cyberabad-cp-sajjanar-home.png (436×349)
శుక్రవారం సైబరాబాద్ సీపీ వి సి సజ్జనార్ ఇంట్లో పాము కలకలం రేపింది. ఏ విధంగా ఇంట్లోకి వచ్చిందో తెలియదు కానీ ఒక 5 అడుగుల పొడవు ఉన్న పాము కమీషనర్ అఫ్ పోలీస్ ఇంట్లోకి చొరబడింది. ఇది గమనించిన ఆయన పాములు పట్టడంలో ఎక్స్పర్ట్ అయిన కానిస్టేబుల్ వెంకటేశ్ నాయక్ ను పిలిపించారు. పాములు పట్టడంలో మంచి నేర్పరి అని వెంకటేశ్ నాయక్ కు పోలీస్ డిపార్టుమెంటులో మంచి పేరుంది.

సైబరాబాద్ సిపి సజ్జనార్ ఇంటికి చేరుకున్న కానిస్టేబుల్ వెంకటేశ్, ఇంట్లోని పామును జాగ్రత్తగా పట్టుకొని ఒక సంచిలో వేసాడు. ఆ పామును నెహ్రు జూలాజికల్ పార్క్ లో అధికారులకు అప్పగిస్తామని వెంకటేశ్ తెలిపాడు.

ఈ విషయం పై స్పందిస్తూ సిపి సజ్జనార్, పామును చూడగానే భయపడి దాన్ని చంపకుండా, పాములును పట్టి రక్షించే సిబ్బందిని పిలవాలని తెలిపారు. ఈ భూమి మీద ప్రతీ ప్రాణికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది అని, వాటికి హాని చెయ్యనంతవరకు అవి మనకు హాని చేయవని ఆయన అన్నారు.

పామును పట్టిన కానిస్టేబుల్ వెంకటేశ్ నాయక్ ను అభినందిస్తూ సిపి సజ్జనార్ నగదు బహుమతిని అందచేశారు. దీంతో కానిస్టేబుల్ చాలా సంతోషించారు.

Post a Comment

0 Comments