ఉగాది కానుకగా తిరుమల ఉద్యోగులకు ఉచితంగా 10 లడ్డూలు

COVID-19 వ్యాప్తిని నివారించడానికి ముందు జాగ్రత్త చర్యగా ప్రసిద్ధ తిరుమల ఆలయం భక్తుల కోసం మూసివేయడంతో, ఆలయ అధికారులు గుడి ఉద్యోగులకు రెండు లక్షలకు పైగా లడ్డూలను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. వైరస్ భయాన్ని దృష్టిలో ఉంచుకుని శుక్రవారం నుండి ఆలయం మూసివేయబడటంతో, అప్పటికే సిద్ధం చేసిన లడ్డాలను భక్తుల మధ్య పంపిణీ చేయలేకపోయారు. 
LADDU.jpg (590×295)
'ఉగాది'కి కానుకగా ప్రతి ఉద్యోగికి 10 లడ్డూలు ఇస్తామని ఆలయ అధికారులు తెలిపారు. 21,000 మంది రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులలకు 2.4 లక్షల లడ్డూలు పంపిణీ చేయనున్నారు. ప్రతి సంవత్సరం ఉగాది పండుగ కానుకగా లడ్డూలను ఉద్యోగులకు కానుకగా టీటీడీ అందిస్తుంది. 

ఆలయ అధికారులు వేలాది మంది భక్తుల కోసం లక్షలాది లడ్డూలను ముందుగానే సిద్ధం చేస్తారు. అయితే, కరోనావైరస్ భయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయం శుక్రవారం నుండి మూసివేయబడటంతో, అప్పటికే సిద్ధం చేసిన లడ్డూలను పంపిణీ చేయలేకపోయింది.

తిరుమలలో ప్రతిరోజూ సగటున 3 లక్షల లడ్డూలు అమ్ముడవుతున్నట్లు అంచనా. ఈ ఏడాది జనవరిలో టిటిడి అధికారులు ప్రతి భక్తులకు ఒక లడ్డూను ఉచితంగా ఇవ్వడం ప్రారంభించింది. ప్రతిరోజూ సుమారు 80,000 నుండి లక్ష మంది భక్తులు ఈ ఆలయాన్నిసందర్శిస్తారు. ఉచితంగా ఇచ్చినాకూడా చాలా మంది భక్తులు లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేస్తారు, ఇది ఒక్కొక్కటి ₹ 50 కి లభిస్తుంది.

Post a Comment

0 Comments