కరోనావైరస్ వ్యాప్తి చెందకుండ ఉబెర్ పూల్, ఓలా షేరింగ్ సర్వసుల నిలిపివేత

భారతదేశంలో అతిపెద్ద క్యాబ్ అగ్రిగేటర్ సేవలు అందించే ఉబెర్ మరియు ఓలా, దేశంలో పెరుగుతున్న COVID-19 కేసుల దృష్ట్యా, వారి రైడ్-షేరింగ్ ఒప్షన్స్ అయిన ఉబెర్ పూల్ మరియు ఓలా షేర్ సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించాయి.
ola-and-uber-stops-cab-sharing-services-in-india
"మేము సర్వీస్ చేస్తున్ననగరాల్లో కరోనావైరస్ వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడాలని మేము నిశ్చయించుకున్నాము. దీన్ని దృష్టిలో ఉంచుకుని, మేము భారతదేశం అంతటా ఉబెర్ పూల్ సేవను నిలిపివేస్తున్నాము. ప్రభుత్వ సలహాకు అనుగుణంగా, ప్రజలు సురక్షితంగా ఉండాలని మరియు అనవసరమైన ప్రయాణాన్నివిరమించుకోవాలని మేము కోరుతున్నాము, ”అని ఉబెర్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

తదుపరి నోటీసు వచ్చేవరకు ఓలా తన “ఓలా షేర్” సర్వీస్ ఆప్షన్లను తాత్కాలికంగా నిలిపివేసింది. "మా డ్రైవర్-భాగస్వాములు మరియు కస్టమర్ల ఆరోగ్యం మరియు భద్రతకు చాలా ప్రాముఖ్యత ఇస్తూ , ప్లాట్‌ఫారమ్‌లోని వాహనాల్లో అత్యధిక స్థాయిలో పరిశుభ్రత ఉండేలా మేము అనేక చర్యలు తీసుకున్నాము. ఓలా షేర్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయడం అనేది పౌరులకు సామాజిక దూరాన్ని ప్రోత్సహించే ప్రయత్నం, ”అని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అవసరమైన ప్రయాణాలకు తమ ఇతర క్యాబ్ సర్వీసులు కొనసాగిస్తామని ఓలా తెలిపింది. 

Post a Comment

0 Comments