యూకే లో 3 వారాల లాక్డౌన్ ప్రకటించిన ప్రధాని బోరిస్ జూన్సన్

అత్యంత ముఖ్యమైన ప్రసంగంలో యూకే పిఎం బోరిస్ జూన్సన్ దేశంలో సామూహిక లాక్డౌన్ కు ఆదేశించారు. అన్ని అనవసరమైన దుకాణాలను మూసివేయడం, ఇద్దరు వ్యక్తుల సమావేశాలను నిషేధించడం మరియు ప్రజలు ఇంట్లోనే ఉండాలి అని ఆదేశించారు. 
uk-lockdown-announces-boris-johnson-for-3weeks.png (551×331)
రోడ్లు, రైళ్లు మరియు బస్సుల్లోని అన్ని ప్రయాణాలను కూడా నిషేధించారు. ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తులకు £ 1,000 పౌండుల వరకు జరిమానా లేదా అరెస్టు చేస్తారు.

అన్ని ప్రధాన టీవీ ఛానెళ్లలో ఒక ప్రత్యేక ప్రసారంలో, PM కరోనావైరస్ "ఈ దేశం దశాబ్దాలుగా ఎదుర్కొన్న అతి పెద్ద ముప్పు" అని అన్నారు. “మీరు నిబంధనలను పాటించకపోతే జరిమానాలు వివిధించే మరియు మిమ్మల్ని చెదరగొట్టే అధికారం పోలీసులకు ఉంటుంది, మళ్ళీ మూడు వారాల తరువాత పరిస్థితిని సమీక్షిస్తామని తెలిపారు. 

"కానీ ప్రస్తుతం సులభమైన ఎంపికలు లేవు. ముందుకు వెళ్ళే మార్గం కష్టం, మరియు చాలా మంది జీవితాలు కోల్పోతారనేది ఇప్పటికీ నిజం. ” అని తన ప్రసంగంలో బోరిస్ జూన్సన్ చెప్పారు. 

కేవలం నాలుగు పరిస్థితుల్లోనే ప్రజలు బయటకు రావొచ్చని ప్రధాని అన్నారు. 
  • పని చేయడానికి ప్రయాణం
  • ప్రాథమిక అవసరాల కోసం షాపింగ్, కానీ సాధ్యమైనంత అరుదుగా
  • ఒంటరిగా లేదా మీ ఇంటి సభ్యులతో నడక, పరుగు లేదా సైక్లింగ్ వంటి రోజుకు ఒక రకమైన వ్యాయామం చెయ్యడానికి 
  • వైద్య సహాయం కొరకు వెళ్ళడానికి లేదా ప్రమాదంలోఉన్నవ్యక్తికి సంరక్షణ అందించడం కోసం వెళ్ళవచ్చు. 
ఇంతముందు సామాజిక దూరం పాటించాలని యూకే ప్రభుత్వం విధించిన నిబంధనలను ప్రజలు లెక్కచేయక పోవడంతో కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందింది. ఇలాంటి పరిస్థితులలో బోరిస్ జూన్సన్ యూకే లో లాక్డౌన్ ప్రకటించారు. 

నిన్న బ్రిటిష్ ఆసుపత్రులలో కోవిడ్ -19 వలన మరో 54 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 336 కు చేరింది. ఇప్పటి వరకు 6650 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి. 

Post a Comment

0 Comments