ఇండియాలో 2902 కి చేరిన పాజిటివ్ కేసులు, కరోనా మరణాలు 68

india-coronavirus-updates-news-telugu.PNG (409×275)
గత 24 గంటల్లో దాదాపు 600 తాజా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో భారతదేశంలో ఈ రోజు కరోనావైరస్ రికార్డు స్థాయిలో పెరిగింది. కరోనావైరస్ వ్యాప్తి తరువాత దేశంలో ఒకే రోజులో ఇంతలా పెరగడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం COVID-19 రోగుల సంఖ్య 2902 కు పెరిగింది. ఢిల్లీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ వారంలో భారీ సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. దేశంలో మరణించిన వారి సంఖ్య 68 కి చేరుకుంది. గత 24 గంటల్లో కనీసం 12 కొత్త మరణాలు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగానే నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు 180 కేసులు నమోదు అయ్యినట్లు వార్తలు వస్తున్నాయి. విజయవాడ కు చెందిన ఒకరు, హిందూపూర్ కి చెందిన ఒకరు మృతి చెందడంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా మరణాల సంఖ్య 2 కు చేరింది. 

తెలంగాణ రాష్ట్రంలో కూడా ఢిల్లీ నిజాముద్దీన్ లో తబ్లిఘి సభ్యుల వలన కరోనావైరస్ కేసులు భారీగానే పెరుగుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 229 గా ఉంది. మరో రెండు కోవిడ్ -19 మరణాలు కూడా నివేదించబడ్డాయి, వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో 11 కి చేరుకుంది.

Post a Comment

0 Comments