కరోనావైరస్ తో పద్మశ్రీ నిర్మల్ సింగ్ మృతి

punjabi-singer-padmashri-nirmal-singh-died-due-to-coronavirus.PNG (298×240)
పద్మశ్రీ గ్రహీత 67 ఏళ్ల సిక్కు ఆధ్యాత్మిక గాయకుడు నిర్మల్ సింగ్ ఈ రోజు తెల్లవారుజామున పంజాబ్‌లో కరోనావైరస్ కారణంగా మరణించారు. గురునానక్ దేవ్ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డులో గురువారం తెల్లవారుజామున 4.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. నిర్మల్ సింగ్ గోల్డెన్ టెంపుల్ వద్ద మాజీ 'హజురి రాగి' మరియు ప్రసిద్ధ కళాకారుడు.  ఈ రోజు తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో అమృత్సర్‌లో ఆయన మరణించారు.

నిర్మల్ సింగ్ ఇటీవల విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చారు, మార్చి 30 న ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, తలతిరుగుతుండడంతో ఆసుపత్రిలో చేరారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలింది. పంజాబ్ రాష్ట్రంలో కరోనా భారిన పడి చనిపోయిన 5వ వ్యక్తి ఈయన. ఇప్పటి వరకు 47 కరోనా పాజిటివ్ కేసులు ఈ రాష్ట్రంలో నమోదు అయ్యాయి. 

అతనితో పాటు ఉన్న అతని ఇద్దరు కుమార్తెలు, కొడుకు, భార్య, ఒక డ్రైవర్ మరియు మరో ఆరుగురిని ఐసొలేషన్ వార్డ్ కు తరలించారు. 

2009 లో పద్మశ్రీని అందుకున్న నిర్మల్ సింగ్, సిక్కు పవిత్ర పుస్తకం గురు గ్రంథ్ సాహిబ్ యొక్క గుర్బానీలో మొత్తం 31 రాగాలలో నిష్టాతులు. 

Post a Comment

0 Comments