భారతదేశంలో లాక్‌డౌన్ పొడిగించరు అనడానికి 5 కారణాలు తెలుసా ?

will-lockdown-in-india-get-extended.png (540×399)
భారతదేశ ప్రజల్లో ఇప్పుడు ఒకటే సందేహం ఉంది అదే " ఇండియాలో లాక్‌డౌన్ పొడిగిస్తారా ? అని. అయితే
ఇప్పటివరకు ఉన్న ప్రాధమిక సమాచారం ప్రకారం భారతదేశంలో లాక్‌డౌన్ లేదా షట్ డౌన్ పొడిగించే అవకాశం లేదు. ఇది నిజమే అనడానికి కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ఏమిటంటే. 

  • మొదటగా చెప్పాలంటే కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా క్లారిటీ తో "లాక్‌డౌన్ పొడిగించే ప్రణాళిక లేదు," అంటూ అధికారికంగా ప్రకంటించారు. 
  • "లాక్‌డౌన్ ముగుసిన తరువాత ప్రభుత్వం మళ్ళీ పొడిగిస్తుందని మీడియాలో పుకార్లు వస్తున్నాయి. కేబినెట్ కార్యదర్శి ఈ వార్తలను ఖండించారు మరియు అవి నిరాధారమైనవని పేర్కొన్నారు. ” అంటూ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్వీట్ చేసింది. 
  • ఏప్రిల్ 2, 2020 న జరిగిన ప్రధాని నరేంద్రమోడి మరియు అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ తరువాత "లాక్‌డౌన్ వచ్చే ఏప్రిల్ 15 న ముగుస్తుంది. కానీ ఇది వీధుల్లోకి ఇష్టం వచ్చినట్టు తిరగడానికి సంకేతం కాదు. వేగాన్ని(కరోనా వ్యాప్తిని) తగ్గించడంలో మనమందరం బాధ్యత వహించాలి. లాక్డౌన్ మరియు సామాజిక దూరం COVID19 తో పోరాడటానికి ఏకైక మార్గం." అంటూ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు ట్విట్టర్లో మెసేజ్ చేశారు. అయితే కొంతసేపు తరువాత ఆ ట్వీటును డిలీట్ చేశారు. ఒక ఆఫీసర్ తప్పిదం వలన పాత ట్వీట్ చేసినట్టు ఆయన మరో ట్వీట్ ద్వారా తెలిపారు. 
  • IRCTC వెబ్సైటు మరియు యాప్ లో 15వ తారీఖు నుండి ట్రైన్ టిక్కెట్లు బుకింగ్ చేసుకొనే సౌకర్యం ఉంది. 
  • దేశీయ విమాన సర్వీసుల టికెట్ బుకింగును కూడా సంస్థలు మొదలు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. 
ఇవన్నీకూడా ఇండియాలో లాక్‌డౌన్ ఎక్స్టెండ్ కాకపోవచ్చు అనడానికి ప్రూఫ్స్. అయితే కరోనా మన దేశంలో ఇంకా తీవ్రరూపం దాలిస్తే మాత్రం లాక్‌డౌన్ కొనసాగవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా త్వరలో ఈ విషయం పై మరింత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. 

Post a Comment

0 Comments