తెలంగాణలో కరోనావైరస్ తో 6 గురి మృతి, అందరూ ఢిల్లీ వెళ్లి వచ్చారు

6-people-died-in-telangana-due-to-coronavirus.png (446×362)
కరోనావైరస్ తో తెలంగాణ రాష్ట్రంలో 6 గురు వ్యక్తులు సోమవారం మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది . వైరస్ తీవ్రత తగ్గుతుంది అని ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలో ఈ బ్రేకింగ్ న్యూస్ తో జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 

మార్చి 13 నుండి 15 మధ్య  ఢిల్లీలోని  నిజాముద్దీన్ ప్రాంతంలోని మార్కాజ్ అనే మత కార్యక్రమానికి హాజరైన తెలంగాణకు చెందిన ఆరుగురు వ్యక్తులు కొరోనావైరస్ బారిన పడ్డారు. సోమవారం మార్చ్30 న గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు మరణించగా, ఒకరు అపోలో హాస్పిటల్, గ్లోబల్ హాస్పిటల్, నిజామాబాద్ మరియు గద్వాల్ లో మరణించారు. 

జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు కొరోనావైరస్ సంక్రమించే ప్రమాదం ఉన్న వ్యక్తులను సంప్రదించి గుర్తించి ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మార్కాజ్‌కి  హాజరైన వారు  స్వచ్ఛందంగా ప్రభుత్వానికి తెలపాలని కోరింది. 

ఢిల్లీలోని మార్కాజ్‌కు హాజరైన వ్యక్తుల ఆచూకీ తెలిసినవారు తమకు తెలియచేయాలి అని తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అనుమానితులకు పరీక్షలు నిర్వహించి ఉచిత చికిత్స అందిస్తామని తెలిపింది. 

నిజాముద్దీన్ వెస్ట్‌లోని తబ్లి-ఎ-జమాత్ కార్యక్రమానికి  మార్చి 1 నుండి 15 వ తారీఖు వరకు నుండి ఇండోనేషియా, మలేషియా నుండి వచ్చిన వారితో సహా 2 వేలకు పైగా ప్రజలు హాజరయ్యారు, వీరిలో కొంతమందికి కరోనావైరస్ ఉండే అవకాశం ఉండడంతో సౌత్ ఢిల్లీ లోని చాలా ప్రాంతాలను సీల్ చేసి ఇంటి ఇంటి కి తిరిగి వారిని గుర్తించే పనిలో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైంది. 

అధికారుల అనుమతి లేకుండా మత కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. మార్కాజ్ కార్యక్రమానికి  నాయకత్వం వహించిన మౌలానా మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. 

ఈ మత కార్యక్రమానికి వెళ్లిన కొందరు వ్యక్తులు తమిళనాడు, కర్ణాటక , ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వచ్చారు. 

Post a Comment

0 Comments