పాజిటివ్ కేసులు రాకుంటే ఏప్రిల్ 7 వరకు తెలంగాణ కరోనా ఫ్రీ స్టేట్ : సిఎం కెసిఆర్

telangana-will-be-coronavirus-free-after-april7-kcr.png (624×308)
తెలంగాణలో పనికి వచ్చిన వలసదారులను జాగ్రత్తగా చూసుకోవడం మా బాధ్యత, మా కుటుంబంలాగే వారిని కూడా చూసుకుంటాం. ప్రతి వ్యక్తికి రూ.500 తో పాటు 12 కిలోల రేషన్ అందించబడుతుంది, భయపడాల్సిన అవసరం లేదు అని తెలంగాణ రాష్ట్ర సిఎం కెసిఆర్ మార్చ్ 29 న జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. 

ప్రగతిభవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఏప్రిల్ 7 వరకు కొత్త కరోనా కేసులు నమోదు కాకపోతే తెలంగాణ రాష్ట్రం కరోనా ఫ్రీ అవుతుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న బాధితుల్లో 11 మంది కోలుకున్నారు, మిగతా 58 మంది ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది అని ఆయన తెలిపారు. అయితే ఇప్పుడే గండం నుండి గట్టెక్కినట్టు అనుకోవద్దు, ఇంకా అందరూ అప్రమత్తంగానే ఉండాలి, లొక్డౌన్ ఉన్నంత కాలం సెల్ఫ్ ఐసోలేషన్ లోనే ఉండాలి అని కెసిఆర్ సూచించారు. 

ఇప్పుడు రాబోయే వరి పంట, మొక్కజొన్న ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అని తెలంగాణ సిఎం కెసిఆర్ రైతులకు భరోసా ఇచ్చారు. వ్యవసాయ మార్కెట్లు మూసివేసిన నేపథ్యంలో రైతులకు టోకెన్లు ఇచ్చివాటిపైన ఉన్నతేదీ ప్రకారం ఊర్లోనే ధాన్యం కొనుగోలు చేస్తాం అని ఆయన చెప్పారు. ఉద్యోగుల జీతాలకు కూడా డబ్బులు లేవు కానీ అప్పు చేసైనా రైతులనుండి ప్రభుత్వం ధాన్యం కొంటుంది అని కెసిఆర్ చెప్పారు. 

Post a Comment

0 Comments