విదేశాల్లో ఉన్న మీవారికి ఫోన్ చేసి ధైర్యం చెప్పండి

telugu-people-in-abroad-countries-should-be-courageful.PNG (747×295)
ప్రపంచంలోనే పెద్ద ఆర్థికవ్యవస్థలైన అమెరికా మరియు యునైటెడ్ కింగ్డమ్ (UK) లో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఇప్పుడు ఆ దేశాల్లో కరోనావైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుండడంతో వారు ఆందోళనలో ఉన్నారు. కేవలం ఈ రెండు దేశాలే కాకుండా అరబ్ దేశాలు, యూరోప్ లోని చాలా దేశాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కు చెందిన వారు ఉద్యోగం మరియు చదువుల కోసం వెళ్లిన వారు ఉన్నారు. 

ముఖ్యంగా వీరి సంఖ్య అమెరికా, UK లో చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే కరోనావైరస్ కేసులు, మరణాల సంఖ్య రోజు రోజుకు ఈ దేశాల్లో పెరుగుతుండడంతో, ప్రభుత్వాలు లొక్డౌన్ ప్రకటించడం, పనులు నిల్చిపోవడం తో  చాలా మంది ఇళ్లల్లోనే తమ సమయాన్ని గడుపుతున్నారు. IT సంస్థల్లో పనిచేసే ఉద్యోగులైతే వర్క్ ఫర్మ్ హోమ్ చేస్తున్నారు, కానీ ఇతర రంగాల్లో పని చేస్తున్న వారు తమ భవిష్యత్తు పై బెంగతో ఉన్నారు. చదువుల కోసం వెళ్లిన విద్యార్థులు ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేసే అవకాశం లేక పోవడంతో, ఎడ్యుకేషన్ లోన్ ఎలా తీర్చాలో అని ఆందోళనలో ఉన్నారు. అరబ్ దేశాల్లో పని చేసేందుకు వెళ్లేవారు కూడా అప్పులు చేసి వెళ్తుంటారు. కరోనావైరస్ నేపథ్యంలో అన్ని రంగాల్లో, అన్ని దేశాల్లో ఉన్నవారు ఎదో ఒక కష్టంలో ఉండే సూచనలు ఉన్నాయి. 

అయితే ఇప్పుడు ఇండియాలో ఉన్న తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు మరియు మిత్రులు విదేశాల్లో ఉన్న తమ వారికి తరచుగా ఫోన్ చేసి యోగ క్షేమాలు తెలుసుకొని ధైర్యం నింపాల్సిన సమయం ఇది. మనం భారతదేశంలో బ్రతకడం ఇలాంటి సమయంలో కూడా కొంచెం సులువే కానీ విదేశాల్లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అందుకే మీ మాటలతో వారిలోని అన్ని రకాల భయాలు తొలిగిపోయి కొత్త శక్తి తో ముందడుగు వేసే అవకాశం ఉంది. 

మీరందరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. చైనాలో మొదలయిన కరోనావైరస్ ఇప్పుడు ఆ దేశంలో తగ్గుముఖం పట్టింది. అంటే చైనా లాగే ఇతర దేశాలు కూడా కరోనా బారినుండి బయట పడడం ఖాయం, కానీ దీనికి కొంత సమయం పట్టవచ్చ. అప్పటి వరకు జాగ్రత్తలు పాటిస్తూ  ఆరోగ్యాన్నికాపాడుకోండి.  

Issued in Public Interest

Post a Comment

0 Comments