కరోనావైరస్ వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన చైనా


కరోనా వైరస్‌ భారిన పడిన మొట్టమొదటి దేశం చైనా, తన కరోనా వాక్సిన్ యొక్క క్లినికల్ ట్రయల్ మొదటి దశను ప్రారంభించింది. ఈ మందును చైనా మిలిటరీ సైంటిస్ట్ తయారు చేశారు. ఆసక్తికరంగా, గత వారం mRNA-1273 అనే టీకా యొక్క క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్లు అమెరికా ప్రకటించింది.

ఈ నెల మార్చి 17 న చైనా క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీలో చేసిన ఎంట్రీ ప్రకారం, ఈ సంవత్సరం చివరి వరకు వాక్సిన్ టెస్టింగ్ కొనసాగుతుంది. శనివారం, సైన్స్ అండ్ టెక్నాలజీ డైలీ కధనం ప్రకారం 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల వాలంటీర్ల మొదటి బ్యాచ్ సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. వారు 3 గ్రూపులుగా విభజించబడ్డారు మరియు ప్రతి గ్రూపులో 36 మంది ఉన్నారు.

ఈ 108 మందికి 14 రోజుల పాటు వివిధ రకాల మందులు వివిధ మోతాదుల్లో ఇచ్చివేరుగా ఉంచి, 6 నెలల పాటు వీటి  ప్రభావం ఎలా ఉంది అనేది మానిటర్ చేస్తారు. ఈ వ్యక్తులకు ఇప్పడికే ఈ వాక్సిన్ టీకాలు వేశారని ఓక సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం, COVID19 ని ఆపడానికి ఆమోదించబడిన వ్యాక్సిన్ సిద్ధంగా లేదు.

Post a Comment

0 Comments