ఈ చిన్నమెషిన్ 5 నిమిషాల్లో COVID-19 ఫలితాలను తెలుపుతుంది

abbott-portable-coronavirus-5minute-testing-machine.PNG (498×255)
కరోనావైరస్ అనుమానితులను పరీక్షించి, ఫలితాలు వచ్చే వరకు వారిని ఐసొలేషన్ లో ఉంచడం, వారు బయటకు వెళ్లకుండా చూడడం ప్రభుత్వం పై ఒక పెద్ద భారం లాంటిందే. ఇటాంటి సందర్భంలో అమెరికన్ కంపెనీ అబ్బోట్ లాబొరేటరీస్ 5 నిమిషాల్లో COVID-19 ఫలితాలను తెలుపగలిగె అత్యంత చిన్నపోర్ట్అబుల్ టెస్టింగ్ మెషిన్ తయారు చేసింది. ఈ విషయాన్ని కంపెనీ తన సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలిపింది. 

అబ్బోట్ యొక్క చిన్న కరోనావైరస్ టెస్టింగ్ మెషిన్ మన ఇంట్లో ఉండే సెట్టాప్ బాక్స్ కంటే కేవలం 3 రెట్లు పెద్దగా ఉంటుంది. Abbott ID NOW గా పిలువబడే ఈ  COVID-19 టెస్టింగ్ మెషిన్ను వచ్చే వారం నుండి అమెరికా లో ఉపయోగించనున్నారు. ఈ మెడికల్ కంపెనీ, రోజుకు 50000 టెస్ట్ కిట్లను అందించడానికి తయారీని పెంచనున్నట్లు తెలిపింది. 
అయితే ఇలాంటి మెషిన్ లు ఇప్పుడు ప్రపంచవ్యాపతంగా కావల్సిఉంది. ఇతర దేశాలకు కరోనావైరస్ ఫలితాలను 5 నిమిషాల్లో తెలుపగలిగే మెషిన్లు అందుబాటులోకి వస్తే కరోనా ని మరింత త్వరగా నిర్ములించే అవకాశం ఉంటుంది. 

Post a Comment

0 Comments