తెలంగాణ రాష్ట్రంలో మొదటి కరోనా మరణం, 65 పాజిటివ్ కేసులు

first-coronavirus-death-in-telangana-etela-rajendar.PNG (344×277)
కరోనావైరస్ వలన తెలంగాణ రాష్ట్రంలో మొదటి మరణం నమోదు అయ్యింది. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ కు చెందిన 74 ఏళ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో మృతి చెందినట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్  మీడియా సమావేశంలో తెలిపారు. గురువారం రాత్రి మార్చ్ 26న ఈ వ్యక్తి మృతి చెందినట్లు తెలుస్తుంది. 

కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తి ఈ నెల 14 వ తారీఖున మతపరమైన కార్యక్రమం కోసం ఢిల్లీ కి వెళ్లి 17వ తేదీన నగరానికి తిరిగి వచ్చినట్టు సమాచారం. మార్చ్ 20 న శ్వాశ తీసుకోవడం లో ఇబ్బంది మరియు జ్వరం రావడం తో ఆ వ్యక్తిని సైఫాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. పరిస్థితి చేయిదాటడంతో దగ్గర్లోని కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్తే, అప్పడికే మృతిచెందినట్టు అక్కడి వైద్యులు తెలిపారు. 

కరోనా లక్షణాలు  ఉండడంతో పోలీసుల సహాయంతో 74 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి  నమూనాలను సేకరించి టెస్టులకు పంపించారు. ఇప్పుడు ఆ ఫలితాలు పాజిటివ్ గా తేలడం తో తెలంగాణ రాష్ట్రంలో మొదటి కరోనావైరస్ మరణం నమోదు అయ్యింది. ఈ విషయాలను మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఆ వ్యక్తి భార్యను, కొడుకుని క్వారంటైన్ లో ఉంచారు. 

తెలంగాణ లో ఈ రోజు మార్చ్ 28 వరకు 65 పాజిటివ్  కేసులు నమోదు అయ్యాయి. ఈ రోజు కొత్తగా 6 పాజిటివ్ కేసుల్లో ఒకరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అని మంత్రి తెలిపారు.  హైదరాబాద్ లో ఎటువంటి రెడ్ జోన్లు లేవని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. 

Post a Comment

0 Comments