కరోనావైరస్ పాజిటివ్ డాక్టర్‌ను కలిసిన తరువాత దిగ్బంధంలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్

జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ని పరీక్షించిన ఒక వైద్యుడు కరోనావైరస్ పాజిటివ్ గా తేలడంతో ఆమె స్వీయ నిర్బంధంలోకి వెళ్తారని ప్రభుత్వ ప్రతినిధి ఆదివారం తెలిపారు. న్యుమోకాకస్ బ్యాక్టీరియాకు టీకాలు వేయడానికి డాక్టర్ శుక్రవారం మెర్కెల్‌ను సందర్శించారు.
merkel_1718264c.jpg (460×288)
"ఛాన్సలర్ వెంటనే ఇంట్లో నిర్బంధంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు . రాబోయే రోజుల్లో ఆమెను క్రమం తప్పకుండా పరీక్షిస్తామని మరియు ఇంటి నుండి తన అధికారిక పనులను చేస్తారని ", అయితే ఛాన్సలర్ కు కరోనావైరస్ సోకిందా లేదా అనేది నిర్ధారించడానికి కొంత సమయం పడుతుంది అని జర్మన్ అధికార ప్రతినిది ఒక ప్రకటనలో తెలిపారు. 

మెర్కెల్ తన 15 సంవత్సరాల పదవీకాలంలో చాలావరకు ఆరోగ్యవంతంగా ఉన్నారు, కానీ ఆమె 2019 వేసవిలో బహిరంగ కార్యక్రమాల్లో పదే పదే వణుకుతూ కనిపించారు. ఆ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆమె ఆరోగ్యంపై చర్చ జరిగింది. 

Post a Comment

0 Comments