Rs 7500 రూపాయలకే వెంటిలేటర్ తయారు చేసిన ట్రాక్టర్ల సంస్థ

mahindra-and-mahindra-rs7500-ventilator.png (443×386)
కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో సహాయపడే ప్రయత్నంలో కేవలం 7,500 రూపాయలతో అధునాతన వెంటిలేటర్‌ ను రూపొందిస్తున్నామని మహీంద్రా & మహీంద్రా కంపెనీ గురువారం తెలిపింది. ఇప్పుడు వెంటిలేటర్ల కొరత ఏర్పడింది మరియు అవసరం మేరకు తయారీ లేదు. దీంతో మహీంద్రా & మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఇచ్చిన పిలుపుకు స్పందించి కండివాలి, ఇగత్పురి మహీంద్రా ప్లాంట్ ఉద్యోగులు కేవలం 48 గంటల్లో తక్కువ ధరలో వెంటిలేటర్ ప్రోటోటైపు తయారుచేశారు. 

ఇలాంటి అధునాతన వెంటిలేటర్ ధర Rs 5 నుండి Rs 10 లక్షల వరకు ఉండొచ్చు. అయితే తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో మహీంద్రా & మహీంద్రా ఉద్యోగులు అతిముఖ్యమైన వెంటిలేటర్ ను తయారు చేయడం హర్షించదగ్గ  విషయం.
"మా కందివాలి, ఇగాత్‌పురి టీములు గురుంచి గర్వంగా ఉన్నాను, వారు ఫ్యాక్టరీలోనే ఉండి , నిద్రమానేసి 48 గంటల్లో దీనిని ఉత్పత్తి చేశారు. మేము ఈ పరికరం యొక్క పనితనం గురించి నిపుణుల నుండి మార్గదర్శకత్వం తీసుకుంటాము. ఫలితం ఏమైనప్పటికీ, వారు భారతదేశ తిరిగి పోరాడగలదని నిరూపించారు" అంటూ మహీంద్రా & మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో ఆనందం వ్యక్తం చేశారు. 

అంతకుముందు, ఎం అండ్ ఎం మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా మాట్లాడుతూ, రెండు పెద్ద పబ్లిక్ సెక్టార్ యూనిట్లతో పాటు, ప్రస్తుతం ఉన్నవెంటిలేటర్ల తయారీదారులతో కలిసి పనిచేస్తున్నట్లు, డిజైన్‌ను సరళీకృతం చేయడానికి మరియు సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ తక్కువ ధర వెంటిలేటర్లను వినియోగంలోకి తేవడానికి కొన్ని అనుమతులు అవసరం అవుతాయి. కరోనావైరస్ పేషంట్లను ఆదుకోవడంలో ఈ వెంటిలేటర్ అవసరం ఎంతో ఉంది. 

Post a Comment

0 Comments