ఢిల్లీ నిజాముద్దీన్ వెళ్ళివచ్చినవారిని క్వారంటైన్ కు తరలిస్తున్నఏపి ప్రభుత్వం

andhra-pradesh-coronavirus-positive-cases-today.png (320×168)
తెలంగాణ రాష్ట్రంలో 6 కరోనా మరణాలు నమోదు కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ పాజిటివ్ కేసులు తక్కువగానే ఉన్నాకూడా అధికారులు, ప్రభుత్వం యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. మార్చ్ 31 వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏపి లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40 కి చేరింది. ఈ పేషెంట్లను ఐసొలేషన్లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

సోమవారం 164 మందికి COVID-19 పరీక్షలు జరుపగా 17 కేసులు పాజిటివ్‌గా తేలాయి.  మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రాకారం జిల్లాలవారీగా చూస్తే ప్రకాశంలో 11, గుంటూరు లో 9, విశాఖపట్నం లో 6, కృష్ణా లో 5, తూర్పుగోదావరి లో 4, అనంతపురం లో 2, నెల్లూరు, చిత్తూర్, కర్నూల్ జిల్లాల్లో ఒక్కో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 

ఢిల్లీలోని నిజాముద్దీన్ లో మర్కజ్ మత కార్యక్రమానికి  రాష్ట్రము నుండి 369 మంది వెళ్లినట్టు ఇప్పడివరకు అధికారికంగా గుర్తించడం జరిగింది. వీరందరిని పట్టుకొని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే వందల మందిని తరలించగా మిగతా వారిని పట్టుకొనే ప్రయత్నంలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. 

Post a Comment

0 Comments